ఇటీవల కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అత్యధికంగా రైలు బోగీలు పట్టాలు తప్పుతున్నాయి. అందుకు గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నా పెద్దగా సమాధానం కనుక్కోలేకపోయారని సమాచారం. గతంలో రైలు సేవలపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉండేది. గత రెండేళ్లుగా ప్రమాదాలు విస్తృతంగా చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా మరోసారి సికింద్రాబాద్-షాలీమార్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.వెస్ట్ బెంగాల్లోని నాల్ పుర్ స్టేషన్ వద్ద రైలు పట్టాలు తప్పడంతో నాలుగు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని సమాచారం. నాల్ పుర్ స్టేషన్ నుంచి బయలు దేరిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ట్రైన్ స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. కాగా, నిన్న ఉదయం ఈ రైలు సికింద్రాబాద్ నుంచి కోల్ కతాకు వెళ్లింది.