సొర‌చేప ఒక్కో దంతం ఎంత షార్పుగా ఉందో చుడండి..!

-

సొరచేపను చూసి బయపడని వారుండరూ.. ఎందుకంటే అంత పెద్దగా ఉంటుంది. సముద్రం మధ్యలో సరదాగా ఈతకు వెళ్లే వాళ్లు సొరచేపను చూడటానికి చాలా ఆశపడుతుంటారు. భారీ ఆకారంలో ఉండే సొరచేపలు దగ్గరకు వస్తుంటే ఆ థ్రిల్లే వేరబ్బా.. అంటూ పలువురు ఈతగాళ్లు చెబుతుంటారు. అయితే సొరే అనుకుంటే సొర చేప దంతాలు చూసే సగం భయపడొచ్చు.

‘నేచర్ ఈజ్ స్కేరీ’ అకౌంట్ ద్వారా ట్విట్టర్ లో ‘దోస్ టీత్’ అనే శీర్షికతో ఓ వీడియో అప్లోడ్ అయింది. ఈ వీడియో అప్లోడ్ చేసి కొద్ది సేపటికే వైరల్ అయింది. ఇప్పటివరకూ 1.9 మిలియన్లకు పైగా నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. 15 సెకన్ల నిడివి కలిగిన ఈ అంతలా ఏముంది అనుకుంటున్నారా.. ఓ పెద్ద సొరచేప సముద్రంలో ఈత కొడుతూ వస్తుంటుంది. అకస్మాత్తుగా సొరచేప తన దంతాలు అన్ని బయటకు తీస్తుంది చూడండీ.. ఒకేసారి ఒళ్లు జలదరించేలా.. ఒక్కో దంతం ఎంత షార్పుగా ఉన్నాయో.. ఈ వీడియోను చూస్తేనే అర్థం అవుతుంది. శబ్దం చేస్తూ అన్ని దంతాలు బయటకు తీసి.. మళ్లీ మూసేసుకుని అలా వెళ్లిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news