దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో వచ్చిన సీతారామం సినిమా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్విని దత్ ఈ సినిమాని నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 ఆగస్టు 5 న ఈ సినిమా రిలీజ్ అయి మంచి హిట్ ని అందుకుంది. మ్యూజిక్ పరంగా కథ పరంగా కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఈ సినిమా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో సీతగా మృణాల్ నటన అదిరిపోయింది ఈ సినిమా సీక్వెల్ కి ఇప్పుడు అంతా సిద్ధం చేశారు. అయితే తొలి సినిమాలో సీతా రామ్ పాత్రలకి సంబంధించిన కథ పూర్తయింది సీక్వెల్లో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లి చూపిస్తారు అని తెలుస్తోంది. అంటే పాత్రలు అవే ఉంటాయి కానీ నేపథ్యం వేరుగా ఉండబోతోంది. ఇందులో మృణాలు దుల్కర్ జంటని మరోసారి చూసి మురిసిపోవడానికి ఆడియన్స్ అయితే రెడీగా ఉన్నారు త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇవ్వబోతున్నారు.