రాయల్ చాలెంజర్స్ బెంగళూరుని కొత్త ఫ్రాంచైజీకి విక్రయించాలని టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి అన్నారు. ఫ్రాంచైజీపై శ్రద్ధ వహించే యజమానికే అమ్మేయాలని సూచించారు. ఫ్యాన్స్ కోసమైనా ఆ పని చేయాలని కోరారు. కాగా నిన్నటి మ్యాచ్లో ‘రూ.47 కోట్లు బెంచ్కే పరిమితం చేశారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గ్రీన్ (రూ.17.5 కోట్లు), మ్యాక్స్వెల్ (రూ.11.5 కోట్లు), జోసెఫ్ (రూ.11 కోట్లు), సిరాజ్ (రూ.7 కోట్లు) బెంచ్కే పరిమితమయ్యారు.
కాగా, నిన్నటి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. అనంతరం లక్ష చేదనలో బ్యాటింగ్ దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 42, డూప్లెసెస్ 62 పరుగులు చేశారు. మిడిల్ లెటర్ విఫలమైనప్పటికీ దినేష్ కార్తీక్ ఒక్కడే 35 బంతుల్లో 83 పరుగులు చేసి గెలిపించే ప్రయత్నం చేశాడు. అప్పటికి ఆస్కింగ్ రేట్ విపరీతంగా పెరగడంతో బెంగళూరు గెలవలేకపోయింది. దీంతో డీకే పోరాటం వృధా అయిపోయింది.