సెమీఫైనల్ లో చివరి స్థానం కోసం మూడు జట్లు పోటీ !

-

ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఉన్న పరిస్థితులు చూస్తే సెమీఫైనల్ లో మూడు స్థానాలు ఖరారు అయిపోయాయి. ఇండియా, సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా లు వరుసగా మూడు స్థానాల్లో ఉన్నాయి. మొదటి సెమీఫైనల్ లో ఇండియా మరియు నాలుగవ స్థానంలో సెమీస్ కు చేరబోయే జట్టును ఢీకొనబోతోంది. ఇక రెండు మరియు మూడు స్థానాలలో ఉన్న సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా లు రెండవ సెమీఫైనల్ లో తలపడనున్నాయి. అయితే చివరగా సెమీస్ కు చేరబోయే జట్టు ఏది ? న్యూజిలాండ్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లలో ఒకటి చేరనుంది. మూడు జట్లకు ఒక్క మ్యాచ్ ఉండగా.. న్యూజిలాండ్ చివరి మ్యాచ్ లో శ్రీలంక తో ఆడనుంది.. ఒకవేళ శ్రీలంక కనుక ఓడిస్తే కివీస్ ఇంటికి వెళ్లిపోతుంది.. అదే విధంగా పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో ఆడనుంది.. ఇంగ్లాండ్ పరువు కోసం గెలవాల్సిన మ్యాచ్ కావడం వలన పాకిస్తాన్ గెలిస్తే సెమీస్ కు లేదంటే ఇంటికే.. ఇక ఆఖరుగా ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా ను ఢీకొననుంది.

న్యూజిలాండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మూడు గెలిస్తే ఎక్కువ రన్ రేట్ కలిగిన జట్టు సెమీస్ కు వెళుతుంది. ఒకవేళ మూడు ఓడిపోయినా రన్ రేట్ ఎక్కువ ఉన్న జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తుంది, మరి ఏమి జరగనుంది తెలియాలంటే ఈ మూడు మ్యాచ్ లు అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news