బీసీల అడ్డా… కుత్బుల్లాపూర్ గడ్డ.. రెడ్డికి ఛాన్స్ ఉందా?

-

తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలన్నీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ అభ్యర్థిని ఏ స్థానం నుంచి నిలబెడితే విజయం లభిస్తుందో లెక్కలు వేసి మరి అభ్యర్థిని నిలబెడుతున్నారు.

అటు రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అటువంటి స్థానాలలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఒకటి. ఇక్కడి నుంచి కెపి వివేకానంద ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బిజెపి తరఫున కూన శ్రీశైలం గౌడ్ పేరును ప్రకటించారు. శ్రీశైలం గౌడ్ 2009లో ఇండిపెండెంట్ గా గెలిచారు. తర్వాత రెండు ఎన్నికల్లో ఓటమి పొందారు. కానీ ఈసారి కచ్చితంగా గెలుపు తనదేనని శ్రీశైలం గౌడ్ చెబుతున్నారు.

ఈ రెండు పార్టీలు ఇలా ఉంటే అనూహ్యంగా కాంగ్రెస్  రెడ్డి వర్గానికి టికెట్ ఇచ్చింది. బీసీలకు పట్టున్న నియోజకవర్గంలో బీసీ అభ్యర్థులు అయితే పోటీ అయిన ఇస్తారు కానీ, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెడితే గెలవడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంతవరకు ఇక్కడ బీసీ నేతలే గెలిచారు. అయితే కాంగ్రెస్ కుత్బుల్లాపూర్ లో రెడ్డిని నిలబెట్టడంలో ఉన్న వ్యూహాలు ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు.

వివేకానంద శ్రీశైలం గౌడ్ ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. వీరు ఇరువురిలో ఎవరైనా బీసీ సామాజిక ఓట్లు బిఆర్ఎస్, బిజెపి ఇద్దరు బీసీ అభ్యర్థులని నిలబెట్టాయి అలాగే కాంగ్రెస్ కూడా బీసీ అభ్యర్థిని నిలబెడితే కొన్ని ఓట్లు చీలికన్నా జరిగేది. అలాకాకుండా రెడ్డి వర్గం అభ్యర్థిని నిలబెట్టడంతో అసలు డిపాజిట్లే గల్లంతయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే కుత్బుల్లాపూర్ అనేది బీసీల అడ్డా.. ఇప్పటివరకు ఇక్కడ బీసీ నేతలే గెలిచారు.. ఈసారి కూడా బీసీ నేతకే ఛాన్స్ ఉండటం ఖాయం.

అయితే రెండుసార్లు గెలిచిన కేపీ వివేకానంద పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలలో ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకతకు తోడు ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత ఉంది. ఈ రెండు తనకు అనుకూలంగా ఉన్నాయని ప్రజలలో తన వైపే ఉన్నారని ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తానని శ్రీశైలం గౌడ్ చెబుతున్నారు. మరి కుత్బుల్లాపూర్ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో..

Read more RELATED
Recommended to you

Latest news