తెలుగు పరిశ్రమలో దిగ్గజాలు రాలిపోతున్నారు. వరుసగా సీనియర్ నటులు, దర్శకులు మృతి చెందడం ఆందోళనకు గురి చేసింది. అంతకు మందు గొల్లపూడి మారుతిరావు, తాజాాగా సీనియర్ సినీ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు సైతం మృతి చెందడం పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రస్తుతం మరో సీనియర్ నటుడు మృతి చెందారు.
తెలుగులో వెయ్యికి పైగా సినిమాల్లో కనిపించిన సీనియర్ నటుడు జనార్ధన రావు అనారోగ్యంతో మరణించారు. మార్చి 6న ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 40 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న ఆయన సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు చాలా మంది హీరోలతో కలిసి ఎన్నో వందల సినిమాల్లో నటించారు. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్‌తో ఓ సీన్‌లో మనకు కనబడతారు. గవర్నమెంట్ ఆఫీస్‌లోకి రౌడీలు వచ్చినపుడు ఎన్టీఆర్ మాట్లాడేది ఈయనతోనే.
సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌లో జాయింట్ సెక్రటరీగానూ, కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. గుంటూరు జిల్లాలోని పొనిగళ్ల గ్రామం జనార్ధన్‌రావు ఈయన స్వస్థలం. 1000కి తెలుగు సినిమాలతో పాటు, సిరీయల్స్‌లో కూడా నటించారు ఈయన. నాగార్జున , మోహన్ బాబు, చిరంజీవి, శోభన్ బాబు వంటి హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించారు. ఈయన మృతి పట్ల సినీ పరిశ్రమలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.