దాదాపు ఏడాది పాటు క్రికెట్ కి దూరంగా ఉన్నా సరే టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లో కసి ఏ మాత్రం తగ్గలేదు. మరోసారి బ్యాట్ కి పని చెప్పాడు. ప్రస్తుతం ఐపియల్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటున్న ధోనీ… రెచ్చిపోయాడు. ఒకే ఓవర్లో అయిదు సిక్సులు కొట్టాడు. ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్ లో ఉన్న ధోనీ 5 బంతులను సిక్సులు గా బాదాడు. దీనికి సంబంధించిన వీడియోని స్టార్ స్పోర్ట్స్ తమిళ్ పోస్ట్ చేసింది.
ఎవరైనా బౌలర్ బౌలింగ్‌లో ధోనీ ఆ సిక్స్‌లు కొట్టాడా? లేదంటే బాల్ మెషీన్‌తో వేసిన బాల్స్‌ని సిక్స్‌లుగా మలిచాడా? అనేది తెలియదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్నాళ్ళు గా ధోని క్రికెట్ కి దూరంగా ఉన్నాడు. ప్రపంచకప్ తర్వాత ధోనీ సైనిక శిక్షణ లో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత అతను క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరిగింది.
ధోనిని బోర్డ్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. దీనితో ధోని తప్పుకోవడం ఖాయమని అనుకున్నారు అందరూ. అయితే ఐపిఎల్ కోసం ధోని ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాఖండే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మార్చి 29న (ఆదివారం) సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
https://twitter.com/StarSportsTamil?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1235814980944945153%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fsports%2Fcsk-captain-ms-dhoni-lights-up-chepauk-stadium-with-huge-sixes-sk-470330.html