లిప్ లాక్ సీన్లలో నటించలేదని బాధపడుతున్న సీనియర్ హీరో…!

-

ఈ రోజుల్లో ముద్దు సీన్లు లేకుండా సినిమాలు ఉండటం లేదు అనేది వాస్తవం. ప్రతీ సినిమాలో కూడా ముద్దు సీన్ అనేది చాలా వరకు కామన్ గా మారిపోయింది. అది లేకుండా సినిమా ఉండటం లేదు అనేది వాస్తవ౦. ప్రేక్షకులు కూడా వాటి కోసం ఎదురు చూడటంతో దర్శకులు కూడా వాటి సినిమాల్లో ఉంచుతున్నారు. ప్రత్యేకంగా కొన్ని సీన్లను వాటి కోసమే రాయడం విశేషం. దీనితో సినిమాకు మంచి క్రేజ్ వచ్చేస్తుంది.

బాలివుడ్ సినిమాల్లో అయితే ఆ సీన్ లేని సినిమాలను వేళ్ళతో లెక్కపెట్టవచ్చు. తాజాగా ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటించిన మలంగ్ లో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో ఆదిత్య దిశా లిప్ లాక్ సీన్లను ఎక్కువగా చూపించేసాడు దర్శకుడు.

దానిపై అనీల్ కపూర్ ని ఒక విలేఖరి ఒక ప్రశ్న అడిగాడు. మీతో పాటు నటించిన ఆదిత్య, దిశల మధ్య కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి కదా. మీకు ఆ ఛాన్స్ లేదని బాధపడుతున్నారా? అని ప్రశ్నించగా ఇంట్లో నా కూతుళ్లు, భార్య ఉన్నారు. ఈ ప్రశ్నలు అడిగి నేను ఇంటికి వెళ్లగానే నన్ను చావగొట్టాలని మీరు కోరుకుంటున్నారా? నిజం చెప్పాలంటే నాకు కిస్సింగ్ సన్నివేశాల్లో నటించే అవకాశం రానందుకు బాధగానే ఉంద౦టూ కొంటె వ్యాఖ్యలు చేసారు

Read more RELATED
Recommended to you

Exit mobile version