తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టిడిపి పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు యడ్లపాటి వెంకట్ రావు మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావు… సోమవారం ఉదయం హైదరాబాద్లోని ఆయన కుమార్తె నివాసంలో మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటం… అలాగే వయసు మీద పడి పోవడం ఆయన మరణానికి కారణమని సమాచారం అందుతోంది.
ఇక వెంకట్రావు మృతి తో టిడిపి పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. వెంకట్రావు మృతి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తో పాటు పార్టీ నేతలు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం టిడిపి పార్టీకి వరల్డ్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
యడ్లపాటి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ప్రజాప్రతినిధిగా ప్రజల నాయకుడిగా పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు చంద్రబాబు నాయుడు. మంత్రిగా అలాగే రాజ్యసభ సభ్యులుగా ఏపీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి.. ఎనలేనిదని చెప్పారు. కాగా ఇవాళ ఆయన అంత్యక్రియలు గుంటూరులో జరగనున్నట్లు తెలుస్తోంది.