సంచలనం.. వర్మ పై నాలుగు సినిమాలు..?

-

మామూలుగా వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ తన వ్యాఖ్యలతో ఒక ఆట ఆడుకుంటారు అన్న విషయం తెలిసిందే. ట్వీట్లతో, మాటలతో సినిమాలతో ఇలా అన్ని విధాలుగా ఎదుటి వ్యక్తులతో ఆడుకుంటారు రామ్ గోపాల్ వర్మ. కానీ ఇప్పుడు కాస్తా రామ్ గోపాల్ వర్మ విషయంలో సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. మామూలుగా అందరిపై సినిమాలు తీసే వర్మపై ప్రస్తుతం వరుస సినిమాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సినిమాల్లో రామ్ గోపాల్ వర్మ లోపాలను ఎండగడుతూ ప్రస్తుతం ఏకంగా రామ్ గోపాల్ వర్మ పై త్వరలో నాలుగు సినిమాలు తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే జొన్నవిత్తుల ఆర్జీవీ పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. అందులో షకలక శంకర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆర్జివి అంటే రోజు గిల్లే వాడు అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఈ సినిమాకి. పవన్ కళ్యాణ్ పై సినిమా ప్రకటించడంతో దానికి వ్యతిరేకంగా పరాన్నజీవి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అంతేకాకుండా డేరా బాబా మరియు వన్స్ అపాన్ ఎ టైం అనే సినిమాలను కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో వర్మ పై తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఇలా నాలుగు సినిమాలతో వర్మని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వర్మ ని దీనిపై ఎలా స్పందిస్తారు అని అడిగితే వీటన్నింటిని నేను పట్టించుకోను అని అందరూ ఊహించిన సమాధానమే చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version