ఇలా చేస్తే మీ మోకాలి నొప్పులు మాయం..!

-

మోకాలి నొప్పి అనేది కీళ్ల నొప్పుల యొక్క అత్యంత సాధారణ రూపం. వయసు, జీవనశైలి లేదా ఇతర కారణాల వల్ల చాలా మందికి తరచుగా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలలో కనిపిస్తుంది. వారి వయస్సు పెరిగి ఎముకలు అరగటం వల్ల ఈ సమస్య ఏర్పడేది. మోకాలి నొప్పి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి క్రీమ్స్ ని వాడుతాము. అయితే ఈ సమస్యకు ఇంట్లోనే ఒక హోం రెమిడీ ప్రయత్నించడం ద్వారా సమస్య నివారించవచ్చు.

knee-pains

అయితే ముందుగా మిక్సీలో మెంతి గింజలను తీసుకుని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మెంతిగింజల పొడిని జల్లెడ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆతర్వాత అదే మిక్సీలో నల్ల మిరియాలు వేసి, మిక్సీ వేయండి. మెత్తని పిండిలా వచ్చేందుకు మళ్ళీ జల్లెడ పట్టండి. ఇప్పుడు మళ్లీ అదే మిక్సీ గిన్నెలోకి జీలకర్రను తీసుకుని, మిక్సీ పట్టండి. దీనిని జల్లెడ పట్టి, అన్ని పదార్ధాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక ఏర్ టైట్(గాలి చొరబడని) కంటైనర్లోనికి తీసుకుని నిల్వచేయండి.

ఇప్పుడు ఒక గ్లాస్ నీరు తీసుకుని, అందులో సగం చెంచా మిశ్రమం వేసి కలపాలి. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి రుచి కోసం బెల్లం కలుపుకుని తాగొచ్చు. దింతో మోకాలినొప్పి తగ్గుతుంది. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం, 20 రోజుల నుండి రెండు నెలలు ఈ మిశ్రమాన్ని రోజూవారీ తీసుకోవడం మంచిది.

అంతేకాకుండా వెచ్చని నూనెతో కొన్ని నిమిషాలు మసాజ్ చేయటం వలన నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాక వాపును తగ్గిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల ఆవాల నూనెని తీసుకొని, ఒకటి లేదా రెండు వెల్లుల్లి ముక్కలతోపాటు వేడి చేసి కీళ్లపై మసాజ్ చేయడానికి ఈ చమురును ఉపయోగించండి. ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రతి రోజు 20 నిముషాల పాటు మసాజ్ చేయటం వలన కీళ్ళ వాపు మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version