ప్రజల ఆందోళనలు, ఆగ్రహంతో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయకుండానే దేశం విడిచి పారిపోయారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన భార్య సహా ఇద్దరూ అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేరుకు పరారైనట్లు వైమానిక అధికారి వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని రనిల్ విక్రమ్ సింగే శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో ఎమర్జెన్సీ, అధ్యక్షుడు పరారీలో లంక లో అదుపుతప్పిన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రధాని రాణిల్ విక్రమ్ సింగే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే మరో వైపు విక్రమ సింఘె కూడా రాజీనామా చేయాలంటూ ఆందోళన కారులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆయన కార్యాలయం పైకి శ్రీలంక జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ నేపథ్యంలో దేశంలో ఆయన ఎమర్జెన్సీని విధించారు. అంతేకాదు శాంతిభద్రతలను కాపాడేందుకు ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చారు. అవసరమైతే కనిపించిన వారిని కాల్చి పడేయాలి అని వారికి స్పష్టం చేశారు. ఫాసిస్టుల చేతుల్లోకి దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనివ్వనని ఆయన స్పష్టం చేశారు.