తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూపి లాగుతున్నారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి.
విచారణ సందర్భంగా మాజీ DCP రాధాకిషన్ రావు వాంగ్మూలంలో మరిన్ని కీలక విషయాలను వెల్లడించారు.బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారిన వ్యక్తులపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు.రేవంత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, RS ప్రవీణ్ కుమార్, శంభీపూర్ రాజు, రఘువీర్ రెడ్డి, ఈటల, బండి సంజయ్, అరవింద్, పలు మీడియా సంస్థల యజమానుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్, BJPకి ధన సహాయం చేసేవారిపై ఎక్కువగా నిఘా పెట్టారని వాంగ్మూలంలో పేర్కొన్నారు.