పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఉండొద్దు: జగదీశ్ రెడ్డి

-

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నల్లగొండలో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం సరికాదు అని అన్నారు. ఇలా చేయటం దారుణం అని మండిపడ్డారు.

ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. పోలీస్ రాజ్యం నడుస్తోంది అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తోంది. గ్రాడ్యుయేట్ ఎన్నికలో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు నడుం బిగించారు. ప్రశ్నించే వారిపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తుంది అని ఆయన అన్నారు.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు భారీగా పెరిగి ప్రభుత్వం వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఉండొద్దు అని తెలిపారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మాదిరి పని చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news