త్వరలో దిశ విషయంలో సంచలన విషయాలు…!

-

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా అత్యాచారం హత్యకు సంబంధించి తెలంగాణా పోలీసులు త్వరలోనే సంచలన విషయాలను బయటపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ కేసులో కీలకమైన 40 సాక్ష్యాధారాలను పరిక్షల కోసం గానూ ఫోరెన్సిక్ ప్రయోగశాలకు గత ఏడాది డిసెంబర్ రెండో వారంలో పంపించారు. వాటిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, యంత్రాలతో, సూక్ష్మ పరికరాలతో విశ్లేషించారు.

ఇందులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. తొండుపల్లి టోల్‌ప్లాజా కూడలి వద్ద 40 అడుగుల ఎత్తులో ఉన్న సీసీ కెమెరాలో, ఆమె బండి పంక్చర్ చేయడం, బాగు చేయిస్తామని ఆమెను నమ్మించడం, అక్కడ ఉన్న వారికి అనుమానం రాకుండా ఆమెను లారీ చాటుకి తీసుకువెళ్ళడం వంటివి గుర్తించారు. ఇక నిందితుల ముఖాలను స్పష్టంగా కనిపించే విధంగా అభివృద్ధి చేసారు.

ఇక ఆమె సోదరితో దిశా మాట్లాడిన విషయాలను అధికారులు స్పష్టంగా పరిశీలించారు. ఆ రోజు రాత్రి 9 గంటల నుంచి 9.40 గంటల వరకు ‘దిశ’ అక్కడే ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. 15 రోజులకు ముందు ఆమె ఎవరితో మాట్లాడిందో కూడా గుర్తించారు. ఇక ఆమె స్నేహితులకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు సేకరించారు. ఇక నిందితుల ఎన్కౌంటర్ కి సంబంధించి కూడా కీలక విషయాలను పొందుపరిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version