BREAKING : భారత్‌కు చేరుకున్న ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్..!

-

ఆక్స్‌ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ భారత్‌కు వచ్చేసింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనికా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌పై మనదేశంలో ఫేజ్2, ఫేజ్3 ఔషధ ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. కోవిషీల్డ్ గా పిలుస్తున్న ఈ వ్యాక్సిన్‌పై ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ జరపనున్నారు. ఈ వాక్సీన్‌ యూకేలో ఇప్పటికే విజయవంతంగా హ్యూమన్ ట్రయల్స్ పూర్తి చేసింది.

తమ పరిశోధనల్లో అద్భుత ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ హ్యూమన్ ట్రయల్స్ రిజల్ట్స్‌ను ఇటీవల ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్‌’లో ప్రచురించారు. అంతేకాదు ఇది సురక్షితమైన వాక్సీన్. పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు మాత్రమే కనిపించాయి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news