కాబూల్ ఎయిర్‌పోర్ట్ ద‌గ్గర తొక్కిస‌లాట‌, ఏడుగురు మృతి

-

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూలోని అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టు లో మరోసారి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఏకంగా ఏడుగురు పౌరులు మృతి చెందారు. తాలిబన్ల ఆధీనంలోకి ఆప్ఘన్‌ చేరుకున్న తర్వాత అక్కడి పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు పెద్ద సంఖ్య లో విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. వీరు విమానాశ్రయానికి చేరు కోకుండా తాలి బన్లు కంచె ఏర్పాటు చేశారు.

అయినప్పటికీ కంచెను దాటుకుని ఎయిర్‌ పోర్టు కు చేరుకుంటున్నారు. వీరిని నియంత్రించే నేపథ్యంలో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడంతో తొక్కిసలాట జరిగి ఏకంగా ఏడుగురు మృతి చెందిన్లు ఇంగ్లండ్‌ రక్షణ శాఖ ప్రకటించింది. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తీసుకు రావడానికి భారత వైమానిక దళానికి చెందిన విమానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ రోజున 168 మంది భారతీ యులు ఢిల్లీ ఎయిర్‌ పోర్టు కు చేరుకున్నారు. కాగా.. ఆగస్ట్‌ 15 న ఆఫ్ఘనిస్తాన్‌ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news