నిజామాబాద్‌‌లో బాలికపై లైంగికదాడి.. నిందితుడి అరెస్టు

-

అభంశుభం తెలియని మైనర్ బాలికలపై కొందరు కామాంధులు మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు.ప్రతి రోజూ ఏదో ఒక మూలన ఇటువంటి లైంగికదాడుల కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఈ ఘటనల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుండగా,మరికొందరు కుటుంబం పరువుకోసం పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లడం లేదు.ఈ మధ్యకాలంలో మన చుట్టూ ఉండే ఇరుగుపొరుగు వారి నుంచే పెనుప్రమాదం పొంచి ఉందని తరచూ జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.

తాజాగా నిజామాబాద్‌లో టూ టౌన్ పీఎస్ పరిధిలోని ఓ కాలనీకి చెందని బాలికపై శుక్రవారం లైంగికదాడి జరిగింది. మధ్యాహ్నం సమయంలో బాలిక కిరాణ షాపునకు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ఆమెను అడ్డగించాడు. అనంతరం తనకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తనపై జరిగిన దారుణాన్ని బాలిక పేరెంట్స్‌కు చెప్పడంతో వారు స్థానిక పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశారు.దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news