YSR పేరు తొలగించిన చంద్రబాబు..జగన్‌ గతే – వైఎస్‌ షర్మిల

-

YSR పేరు తొలగించిన చంద్రబాబు..జగన్‌ గతే పడుతుందనే అర్థం వచ్చేలా సంచలన పోస్ట్‌ పెట్టారు వైఎస్‌ షర్మిల. వైద్య,విద్యా సంస్థలకు NTR పేరు తొలగించి మాజీ సీఎం జగన్ గారు అనాడు పెద్ద తప్పు చేస్తే.. ఇప్పుడు అదే బాటలో నడుస్తు న్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ మండిపడ్డారు షర్మిల. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు,ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి YSR పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తోందని తెలిపారు.


NTR అయినా, YSR అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన వాళ్లేనని స్పష్టం చేశారు. పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్లే అని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఇద్దరిని చూడాలి తప్పితే.. నీచ రాజకీయాలు ఆపాదించడం సమంజసం కాదన్నారు. YSR అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్,రుణమాఫీ,ఉచిత కరెంట్,పెన్షన్లు, ఇలా ప్రతి పథకం దేశానికే ఆదర్శమని వెల్లడించారు. YSR ఏదో ఒక్క పార్టీకి సొంతం కాదన్నారు.. తెలుగు వారి ఆస్తి. తెలుగు వారి గుండెల్లో ఆయన స్థానం ఈనాటికీ పదిలం అని వెల్లడించారు. YCP మీద ఉన్న కోపాన్ని YSR మీద రుద్దడం సరికాదన్నారు. YCPలో YSR లేడు. అది ఎన్నటికైనా వైవీ, సజ్జల, సాయి రెడ్డి పార్టీనేనని సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news