నన్ను లైంగికంగా వేధించింది.. జానీమాస్టర్‌పై కేసు పెట్టిన యువతిపై యువకుడి ఫిర్యాదు

-

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ లైంగిక వేధింపుల కేసులో మరోకొత్త కోణం వెలుగుచూసింది. తనను పలుమార్లు లైంగికంగా దాడి చేశాడని జానీపై అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పోక్సో కింద కేసు నమోదైంది. ఇటీవల జాతీయ అవార్డు తీసుకునేందుకు కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. కేంద్రం జాతీయ అవార్డును వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌పై ఓ యువకుడు లైంగిక దాడి ఆరోపణలు చేశాడు.

జానీ మాస్టర్‌పై లైంగికదాడి కేసుపెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.తన మామ జానీ మాస్టర్‌తో కలిసి హైదరాబాద్,చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి,నగ్న ఫొటోలు తీసి బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.అప్పుడు తాను మైనర్‌ అని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version