తెలంగాణ స్కిల్ వర్శిటీలో కొత్త కోర్సులు.. దరఖాస్తు ఎప్పుడు చేయాలంటే?

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీలో కొత్త కోర్సులు వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పరిశ్రమల శాఖ ఓ ప్రకటన జారీచేసింది. ప్రస్తుతానికి లాజిస్టిక్స్, ఈ-కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో కోర్సులను యూనివర్శిటీ ఆఫర్ చేస్తున్నదని పేర్కొన్నది.

రానున్న రోజుల్లో ఇతర విభాగాల్లోనూ కొత్త కోర్సులను జోడించి మరోసారి ప్రకటన చేస్తామని తెలిపింది. యువతకు నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా స్కిల్స్ యూనివర్శిటీ ద్వారా కోర్సులను నిర్వహిస్తుండగా, ఆయా రంగాలకు చెందిన పరిశ్రమల యాజమాన్యం సాంకేతిక సాయాన్ని అందించనున్నాయి. కాగా, ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో పర్మినెంట్ క్యాంపస్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభోత్సవం చేసినా భవనాల నిర్మాణాలకు మరింత సమయం పట్టనున్నది.అందుకే ఈ ఐదు రంగాల్లోని కోర్సులను రాయదుర్గంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో తాత్కాలిక క్యాంపస్‌ ఏర్పాటు చేసి నిర్వహించేలా వర్శిటీ పాలక మండలి నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version