Shah Rukh Khan: జైలుకు వెళ్లిన బాలీవుడ్‌ బాద్‌షా !

-

Shah Rukh Khan: బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే పలువురు సినిమాతారలు ఈ కేసులో చిక్కుకున్నారు. బాలీవుడ్‌ బడా హీరో కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న కుమారుడు ఆర్య‌న్ ఖాన్ ను చూసేందుకు ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలుకెళ్లారు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్. ఆయన త‌న‌ కుమారుడిని కలిసి కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు. డ్రగ్స్‌ కేసులో అక్టోబర్‌ 2న అరెస్టయ్యాయిన త‌రువాత ఆర్యన్‌ఖాన్‌ను.. షారుఖ్‌ కలుసుకోవడం ఇదే తొలిసారి.

నిన్న ముంబై సెషన్స్‌ కోర్ట్‌ ఆర్యన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పటికే ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం మూడుసార్లు తోసిపుచ్చింది. తాజాగా బుధవారం కూడా ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది. ఆర్య‌న్ ఖాన్ డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో సంబంధాలున్నాయని, అందుకు ఆధారాలు ఉన్నాయ‌ని ఎన్సీబీ కోర్టుకు సమర్పించింది.

అలాగే.. ఓ హీరోయిన్‌తో ఆర్యన్‌ చేసిన చాటింగ్‌ను కూడా కోర్టు స‌మ‌ర్పించింది. ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఎన్సీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు..ఆర్యన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు తిరస్కరించింది. దీంతో షారుఖ్ ఖాన్ … ఆర్యన్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version