OTTలోకి షాహిద్ కపూర్ ‘జెర్సీ’..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

-

నేచురల్ స్టార్ నాని- గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కి..జాతీయ అవార్డు గెలుచుకున్న పిక్చర్ ‘జెర్సీ’. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ ఇందులో హీరోగా నటించగా, హీరోయిన్ గా మృణాళ్ ఠాకూర్ నటించింది. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరియే హిందీ ఫిల్మ్ కూ దర్శకత్వం వహించారు.

అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ ఈ మూవీని హిందీలో ప్రొడ్యూస్ చేశారు. గత నెల 22న విడుదలైన ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్ కు చక్కటి మార్కులు పడ్డాయి. కానీ, చిత్రం అనుకున్న స్థాయిలో విజయం అయితే సాధించలేదు.

ఇక ఈ సినిమా OTT రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో షాహిద్ కపూర్ ‘జెర్సీ’ స్ట్రీమ్ అవుతుందని తెలిపారు. అయితే, చిత్ర ఫలితం తనను కొంత నిరాశపరిచిందని హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ చెప్పారు.

పిక్చర్ లో నటీనటుల పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ చిత్రం విడుదల చేసిన టైం, మార్కెటింగ్ కొంత ప్రభావం చూపకపోవచ్చని తెలిపింది. ఇకపోతే తెలుగు ‘జెర్సీ’ ఫిల్మ్ ఆల్రెడీ యూట్యూబ్ లో డబ్ అయి ఉండటం కూడా కొంత నష్టం కలిగించిందనే అభిప్రాయం వ్యక్తం చేసింది హీరోయిన్. ‘కబీర్ సింగ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత షాహిద్ కపూర్ నటించిన చిత్రం ‘జెర్సీ’.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version