ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్గా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈవెంట్లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేయనున్నారు. బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ పర్ఫార్మ్ చేయనున్నారు. ఆయనతోపాటు షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తీక్ ఆర్యన్ రానున్నారు. డబ్ల్యూపీఎల్ 2024 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరుగుతుండగా మొత్తం ఐదు టీమ్స్ 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
సీజన్లో మొదటి దశ మ్యాచ్లు బెంగళూరులో, ఆ తర్వాతి మ్యాచ్లు ఢిల్లీలో జరగనున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.జియో సినిమా, స్పోర్ట్స్ 18లో ప్రారంభ వేడుక సహా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.