ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు

-

దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు పంపింది. లిక్కర్ స్కాం కేసులో ఈనెల 26న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు కవితకు దర్యాప్తు సంస్థ నోటీసులు ఇవ్వగా ఆమె హాజరు కావడానికి నిరాకరించారు. ఈసారైనా విచారణకు వెళ్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 50 కింద కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు నమోదు చేశారు. సౌత్ గ్రూప్ నుంచి కవితను కీలక వ్యక్తిగా, 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారాలు, ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలపై కవితను ఈడీ ప్రశ్నించింది.

Read more RELATED
Recommended to you

Latest news