‘శాకిని డాకిని’ ట్రైలర్ రిలీజ్.. నివేదా, రెజీనా అదరగొట్టేశారు..

-

మల్టీ స్టారర్ అనగానే ఇద్దరు హీరోలు ఉంటారనే అనుకుంటాం. అదే ఓ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుండటం కామనే. కానీ ఇద్దరు హీరోయినట్లు కూడా హీరోలకు తీసిపోకుండా ఫైట్లు, అడ్వెంచర్లు చేస్తే.. ఆహా ఊహకే ఎంతో బాగుంది కదా. శాకిని డాకిని సినిమా ఇలాంటిదే. నివేదా థామస్‌ , రెజీనా కసాండ్రా కలిసి నటించిన చిత్రం ‘శాకిని డాకిని’ . సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించారు.

ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. శిక్షణ కోసం పోలీసు అకాడమీలో చేరిన ఇద్దరమ్మాయిల కథతో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌, డ్రామా, హాస్యం మేళవింపుగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ట్రైలర్‌లోని ఇద్దరి కథానాయికల లుక్స్‌, పోరాట దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి, వీరికి ఎదురైన సమస్యేంటి? ఎందుకు పులుల్లా మారాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డి. సురేశ్‌బాబు, సునీత తాటి, హ్యూన్‌ వూ థామస్‌ కిమ్‌ నిర్మించిన ఈ సినిమా దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కి రీమేక్‌.

Read more RELATED
Recommended to you

Latest news