ప్రభాస్ సినిమా ఫెయిల్యూర్ అన్న ప్రముఖ నిర్మాత.. కానీ అదిరిపోయే కలెక్షన్స్..!!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాగా అంతకు మునుపు కూడా ప్రభాస్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ప్రభాస్ నటించిన ఈ చిత్రం చూసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆ సినిమా ఫెయిల్యూర్ అని డిసైడ్ చేశాడట. ఆ విషయం ప్రభాస్ కు కూడా చెప్పాడు. ఆ సినిమా ఏది? ఇంతకీ ఆ నిర్మాత ఎవరు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘మున్నా’. వంశీ పైడిపల్లి స్టైలిష్ టేకింగ్ చూసి ఇండస్ట్రీ వాళ్లు వావ్ అన్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదనేది ఇండస్ట్రీ వర్గాల వాదన. కాగా, నిజానికి ఈ సినిమా వంద రోజులు ఆడింది.

ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్ ప్రకారం.. సినిమా అయిపోయిన తర్వాత థియేటర్ లో ‘మున్నా’ చూసిన దిల్ రాజు.. ప్రభాస్ వద్దకు వెళ్లి సినిమా ఫెయిల్యూర్ అని చెప్పారట. తాను మళ్లీ మంచి సినిమా చేస్తానని ప్రభాస్ తో అన్నారట. అయితే, ఆ తర్వాత ‘మున్నా’ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి దిల్ రాజు షాక్ అయ్యారట.

 

‘మున్నా’ ఫిల్మ్ లో డైరెక్టర్ స్టైలిష్ టేకింగ్ జనాలకు బాగా నచ్చిందన్న సంగతి మూవీకి వచ్చిన కలెక్షన్స్ ను బట్టి చెప్పొచ్చు. అదిరిపోయే కలెక్షన్స్ ఈ సినిమా ఇవ్వడం గమనార్హం. ప్రభాస్ తో ‘మున్నా’ తీసిన దిల్ రాజు.. ఆ తర్వాత చాలా కాలానికి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే బ్లాక్ బాస్టర్ మూవీ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్-కె’, ‘ఆదిపురుష్’ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news