కేసులు ఉన్న నిందితులు కూడా మాట్లాడుతున్నారా ? షర్మిల ముఖ్య అనుచరుడు సంచలనం !

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో రాజన్న రాజ్యం కోసమే షర్మిల పార్టీ పెడుతున్నారని షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వైఎస్సార్ సీపీతో షర్మిలకు సంబంధం లేదు, అసలు తెలంగాణలో వైసీపీ లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల స్పష్టం చేశారని ఆయన ఆన్నారు. ఒకరికి తోక పార్టీగా ఉండేందుకు సిద్ధంగా లేమన్న ఆయన అన్ని జిల్లాల నేతలతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు.

వైఎస్ సెంటిమెంట్ గా చేవెళ్ల, నల్గొండ నియోజకవర్గ నేతలతో సమావేశం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందన్న ఆయన ఎవరో వదిలి బాణం షర్మిల కాదు… తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా వస్తున్నామని అన్నారు. చేతకాని నాయకులు, కేసులు ఉన్న నిందితులు కూడా షర్మిల పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన రేవంత్ ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. 

TOP STORIES

ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా...? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్...