ఎన్నికలకి సమయం దగ్గర పడుతూ ఉండడంతో పార్టీలు విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఓటర్ల ని ఆకర్షించే విధంగా ప్రచారంతో దూసుకు వెళ్తున్నాయి. అయితే ఈ నేపథ్యం లో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ షర్మిల ప్రజలతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో అన్నీ మాఫియాలే అని ఆరోపించారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను జగన్ మోసం చేశారని అన్నారు మద్యం ఇసుక మట్టిలో భారీ అవినీతి చేశారని ఈ ఫైర్ అయ్యారు షర్మిల ప్రజలందరూ వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయాలని అన్నారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నెరవేరుతుందని అన్నారు.