మల్కాజ్గిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పొలిటికల్ లీడర్ కి మెరిట్ ఉండాలని పేదల బాధలు అర్థం చేసుకునే మెరిట్ ఉండాలని అన్నారు. పీపుల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ పై రేవంత్ రెడ్డి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. నాలుకకి నరం లేకుండా రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారని ఫైర్ అయ్యారు.
ఆగస్టు లో రుణమాఫీలు చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన వాడిగా ఎలా నమ్మాలో అర్థం కావట్లేదు అన్నారు. పెన్షన్ వలన 44 లక్షల మందికి 23 వేల కోట్లు అవసరం అవుతాయని రూ. 2500 చొప్పున కోటిన్నర మందికి 40,000 కోట్లు కావాలని ఇచ్చిన హామీలకు లక్ష కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి ఎక్కడి నుండి తీసుకు వస్తారో మేధావులు చర్చ పెట్టాలని ఈటల అన్నారు నేను ఊరికే దండం పెట్టే కల్చర్ ఉన్నవాడిని కాదని సేవ చేసే వాడినని చెప్పారు.