ఎర్రగొండపాలెం ఎంఎల్ఏ మంచోడయితే ఇక్కడ నుంచి ఎందుకు మార్చారు అని షర్మిల అన్నారు. మన ఇంట్లో చెత్త ఉంటే అవతల వేస్తాం ఈయన చెత్త అని వీళ్ళే ఒప్పుకున్నారు అని షర్మిల అన్నారు. ఇలాంటి చెత్తలకు,చెత్త పార్టీలకు ఓటు వేయడం అవసరమా అని అన్నారు జగన్ కి ఓటు వేస్తే ఈ నియోజక వర్గం బాగుపడుతుంది అనుకున్నారు. ఏం ఉద్దరించారు అని అన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ YSR కట్టాలని అనుకున్న ప్రాజెక్ట్ అని కూడా షర్మిల అన్నారు.
4.50లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్, 15 లక్షల మందికి త్రాగునీరు అందించే ప్రాజెక్ట్ ని 60 శాతం YSR హయాంలో పూర్తి చేశారు అన్నారు షర్మిల. చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేక పోయారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును విమర్శ చేశారు అని షర్మిల అన్నారు. అధికారంలో వచ్చాకా 6 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పారు శాంతిల. 5 ఏళ్లు అధికారం అనుభవించి తట్టెడు మట్టి తీయలేదని షర్మిల అన్నారు.