Sharukh Khan: కొడుకు చేసిన ప‌నికి తండ్రికి క‌ష్టాలు! షారూక్ బ్రాండ్ ఇమేజ్ పై నీలి నీడ‌లు.. కోట్ల‌ల్లో న‌ష్టం!

Sharukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌.. ఆయ‌నకు ఉన్నంతా ఇమేజ్ బాలీవుడ్లో ఏ హీరోకు లేదన‌డంలో ఏలాంటి అతిశ‌యోక్తి లేదు. ఇప్పటికే వ‌రుస సినిమాలతో పాటు.. ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ వ్యవ‌హ‌రిస్తున్నారు. కానీ త‌న కొడుకు ఆర్యన్ చేసిన ప‌నికి తండ్రి షారుఖ్ బ్యాండ్ ఇమేజ్‌పై నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. షారుఖ్ బ్రాండ్ ఇమేజ్ భారీగా పాతాళానికి పడిపోతోందని, అతనితో కలిసి పనిచేస్తున్న కంపెనీలన్నీ నెమ్మదిగా సంబంధాలు తెంచుకునే పనిలో ఉన్నాయ‌ని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

డ్రగ్స్ వ్యవహారంలో షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ జైలుకు వెళ్లిన‌ప్ప‌టి నుంచి అనూహ్యంగా బైజు బాలీవుడ్ స్టార్ ప్రకటనలను నిలిపివేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక నుంచి బైజూ యాడ్ లో షారుఖ్ ఖాన్ ను చూడలేమ‌ని ఊహ‌గానాలు వ‌స్తున్నాయి. బైజు యాడ్స్ చేయడం ద్వారా షారుఖ్ ఖాన్ సంవత్సరానికి మూడు నుంచి నాలుగు కోట్ల ఆదాయం వ‌స్తుంది. అతను 2017 నుండి బై జ్యూస్ కంపెనీతో క‌లిసి ప‌నిచేస్తున్నాడు.

అస‌లు బైజు .. షారూక్ ప్రకటన నిలిపివేసిందంటే.. ఆర్యన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న‌ప్ప‌టి నుంచి షారుక్ ప్ర‌చార‌క‌ర్తగా వ్య‌వ‌హ‌రిస్తున్న బైజు ఎడ్యూకేష‌న్ యాప్‌పై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. షారూక్ త‌న కొడుకునే అదుపులో పెట్టుకోలేని వాడు.. ఓ విద్యా సంబంధిత యాప్ కు ఎలా బ్రాండ్ అంబ‌సిడార్ గా వ్య‌వ‌హ‌రిస్తారు అంటూ విపరీతంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీంతో బైజు వెంటనే షారూక్ ప్రకటనలు నిలిపివేసింది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హ్యుందాయ్, దుబాయ్ టూరిజం, ఐసిఐసిఐ బ్యాంక్‌తో పాటు 40 కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు.