MAA ELECTION : మా అధ్యక్ష ఎన్నికపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. మోహన్‌ బాబు, చిరంజీవి ఇద్దరూ !

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో ఇవాళ మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల కోలాహలం నెలకొంది. మా అసోషియేషన్‌ ప్యానెల్‌ సభ్యులంతా ఉత్సాహంగా ఓటింగ్‌ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యం లోనే మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మోహన్‌ బాబు, చిరంజీవి ఇద్దరూ మంచి స్నేహితులే నని… మా ఎన్నికల నేపథ్యంలో వారిందరి మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు రావడం చాలా తప్పు అన్నారు పవన్‌ కళ్యాణ్‌.

pawan-kalyan
pawan-kalyan

మా ఎన్నికలకు ఇంత హడావుడి అవసరం లేదని…సినిమాలు చేసేవాళ్లు ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. మా ఎన్నికల కారణంగా సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదని తేల్చే చెప్పారు పవన్‌ కళ్యాణ్‌. తిప్పి కొడితే 900 ల ఓట్లు లేవని.. . ఇందులో వ్యక్తిగత దూషణలు అవసరమా ? అని ప్రశ్నించారు పవన్‌ కళ్యాణ్‌. ఇలాంటి పోటీ తానేప్పుడు చూడలేదని.. ఈ ఎన్నికల కారణంగా చీలిక రాదన్నారు. కాగా.. కాసేపటి క్రితమే మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు జాబ్లి హిల్స్‌ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభం అయ్యాయి.