తెలంగాణలో విషాదం.. గోడ కూలి ఐదుగురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసు కుంది. భారీ వర్షాల నేపథ్యం లో గోడ కూలి.. ఎకంగా ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా… అయిజ మండలంలోని కొత్తపల్లి లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… బోగులాంబ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి విపరీతంగా వర్షం పడుతోంది. అలాగే… ఆ జిల్లాలోని కొత్తపల్లి లోనూ భీభత్సంగా వర్షం పడింది.

ఈ నేపథ్యంలోనే ఆ గ్రామంలోని ఓ నివాస గృహం కూలి ఏకంగా ఐదుగురు మృతి చెందారు. ఆ ఇంట్లో ఏడుగురు నిద్రిస్తుండగా.. గోడ కూలడం కారణంగా ఐదు మంది అక్కడికక్కడే చని పోయారు. ఇక ఈ దారుణ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే… మృతి చెందిన ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారే కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. రెండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.