సూయజ్ కాలువ ను అడ్డుకున్న ఒక పెద్ద కంటైనర్ నౌక అయిన ఎవర్ గివెన్ ప్రపంచాన్ని టెన్షన్ లోకి నెట్టేసింది. అయితే దీనిని మళ్ళీ లైన్ లో పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పుడు కాస్త కదిలింది అని అంటున్నారు. అయితే అది పూర్తిగా ఎప్పటికి కదులుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ నౌక ఎప్పుడు రీఫ్లోట్ అవుతుందో స్పష్టంగా తెలియదని ఈ కాలువ అథారిటీ అధిపతి పేర్కొన్నారు.
400 మీటర్ల పొడవైన ఎవర్ గివెన్ మంగళవారం తెల్లవారుజామున అధిక గాలుల నేపధ్యంలో కాలువ యొక్క దక్షిణ భాగాన్ని ఢీకొంది. ఆ విధంగా ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జలమార్గాలలో ఒకదాన్ని అడ్డుకుంది. ఓడ చుట్టూ ఉన్న వస్తువుల ద్వారా పూడిక తీయడం అలానే టగ్‌బోట్‌లతో నౌకను ఒక పక్క లాగుతూ మరో పక్క నెట్టడంతో శనివారం ఓడలో కాస్త కదలిక వచ్చింది.