ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీ-శివ‌సేన లొల్లి… కాక రేపుతోన్న మ‌హా పాలిటిక్స్‌

-

మహారాష్ట్రలో బీజేపీని జనసేన ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూట‌మిగా పోటీ చేసిన బిజెపి – శివసేన అత్యధిక సీట్లు సొంతం చేసుకున్నాయి. ఈ ఫలితాల్లో బిజెపి 105 సీట్లు గెలుచుకోగా… శివసేన 56 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, ఎన్సీపీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాయి. అసలు ఎన్నికలకు ముందు జనసేన – బిజెపి పొత్తు ఉంటుందా ? అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే బీజేపీనే చొరవ తీసుకుని తమ‌కు శివసేన నమ్మకమైన మిత్రపక్షం అంటూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది.

బీజేపీతో పొత్తు ఖరారైనప్ప‌టి నుంచే శివ‌సేన త‌మ‌కు రెండున్న‌రేళ్లు ముఖ్య‌మంత్రి పీఠం కావాల‌ని ప‌ట్టుబ‌ట్టింది. ఇక ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా వర్లీ అసెంబ్లీ బరిలో దిగిన ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి పీఠం ఇవ్వాల్సిందే అంటూ శివ‌సేన ప‌ట్టుబ‌ట్టుకుని మ‌రీ కూర్చొంది. అక్క‌డితో ఆగ‌ని శివ‌సేన కేబినెట్ బెర్తుల‌ను కూడా 50-50 రేషియోలో పంచాలంటోంది.

అయితే బీజేపీ మాత్రం అస‌లు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని పంచుకునే ప్ర‌శ‌క్తే లేద‌ని చెపుతోంది. ఇక అస‌ర‌మైతే తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో క‌లిసి అయినా ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని శివ‌సేన సంకేతాలు ఇస్తుండ‌డంతో బీజేపీలో ఎక్క‌డా లేని టెన్ష‌న్ నెల‌కొంది. ఇక బీజేపీ, శివసేన వేర్వేరుగా గవర్నర్‌తో భేటీ అవడంతో మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక త‌ర‌చూ వివాస్పద వ్యాఖ్య‌ల‌తో మహారాష్ట్ర రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తూ…. బీజేపీని ఉడికించే శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ మ‌రోసారి వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

‘ఇది మహారాష్ట్ర. ఎవరి తండ్రి అయితే జైలులో ఉన్నారో అటువంటి దుష్యంత్‌ ఎవరూ ఇక్కడ లేరు’ అని బీజేపీ హ‌రియాణాలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన తీరును ఎద్దేవా చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 10 స్థానాలు కైవసం చేసుకున్న జననాయక జనతా పార్టీ(జేజేపీ) అధినేత దుష్యంత్‌ చౌతాలాతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయ‌డంతో పాటు దుష్యంత్‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. ఇక దుష్యంత్‌ ప్రమాణ స్వీకారానికి జైలులో ఉన్న ఆయన తండ్రి అజయ్‌ చౌతాలా పెరోల్‌పై బయటకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా అటు శివ‌సేన‌, ఇటు బీజేపీ ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గే ప్ర‌శ‌క్తే క‌న‌ప‌డ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో శివ‌సేన బీజేపీని ఉడికించే వ్యాఖ్య‌లు చేస్తుండ‌డంతో మ‌హారాష్ట్ర రాజకీయాలు బాగా కాక రేపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news