శివసేన ముఖ్య నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్(ఈడీ) అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పత్రాచల్ కుంభకోణంలొ ( మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌతు ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో విచారించిన ఈడి సంజయ్ రౌత్ ని అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు.
ఈ స్కామ్ లో ఇదివరకే రెండుసార్లు ఆయనకు సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. కానీ ఆయన నోటీసులకు స్పందించకపోవడంతో ఈడి అధికారులే ముంబైలోని రౌత్ ఇంటికి వెళ్లి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో తాజాగా సంజయ్ రౌత్ కు జ్యూడిషియల్ కస్టడీని విధించింది కోర్టు. ఆయనకు రెండు వారాలపాటు జుడీషియల్ కస్టడీని విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన ఆగస్టు 22 వరకు కస్టడీలో ఉండనున్నారు. ఈడి కస్టడీకి గడువు ముగియడంతో రౌత్ ను అధికారులు ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.