పాత్రాచాల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఇటీవల శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టు అయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) అరెస్టు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీనిని పొడిగిస్తూ ముంబైలోని ఈడీ ప్రత్యేక కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సంజయ్ రౌత్ ఈనెల 19 దాకా జైల్లోనే ఉండనున్నారు.
గోరేగావ్ శివారులోని పాత్రచాల్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసు నమోదు చేసి ఆగస్టు 1న సంజయ్ రౌత్ ను ఈడి అరెస్టు చేసింది. ఈడి కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు ఆయనను రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ రిమాండ్ గడువు సోమవారంతో ముగియగా.. ఈడి అధికారులు ఆయనను నేడు కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తికానందున రౌత్ ను తిరిగి జుడిషియల్ రిమాండ్ లోనే ఉంచాలని ఈడీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఆయనకు మరో 14 రోజులపాటు రిమాండ్ విధించింది.