జ‌గ‌న్ ఈ పెను స‌వాళ్లు ఎలా ఎదుర్కొంటాడో…. !

-

మేనిఫెస్టో. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తి పార్టీ కూడా ప్ర‌జ‌ల ముందుకు తెచ్చే కీల‌క ప‌త్రం. అయితే, దీనికి ఇ ప్పటి వ‌రకు పెద్ద‌గా ప్రాధాన్యం లేకుండా పోయింది. కానీ, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. గత ఏడాది ఎన్నిక‌ల స‌మ యంలో ప్ర‌వేశ పెట్టిన మేనిఫెస్టోతో ప్ర‌జ‌ల‌కు-పార్టీలు చేసే హామీలపై ఫుల్ క్లారిటీ వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు అస‌లు మేనిఫెస్టో అంటే లైట్‌గా తీసుకున్న‌వారు కూడా మేనిఫెస్టోకు ఇంత బ‌లం ఉంటుందా? అని అను కున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ త‌ను ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌వేశ పెట్టిన మేనిఫెస్టోలోని అంశాల‌ను ఫుల్ ఫిల్ చేసేలా కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు సాగుతున్నారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు. అమ్మ ఒడి, ఆరోగ్య‌శ్రీ, రైతు భ‌రోసా, వైఎస్సార్ వాహ‌న‌మిత్ర‌, పేద‌ల‌కు ఇళ్లు, పింఛ‌న్ల పెంపు వంటి సామాజిక ల‌బ్ధి చేకూర్చే ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. అయితే, మ‌రోసారి ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఇవి స‌రిపోతాయా? కేవలం ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచితే.. మ‌ళ్లీ గెలుపు గుర్రం ఎక్కే ఛాన్స్ ఉంటుందా? అనేది మేధావుల మాట‌. మేనిఫెస్టోలో పేర్కొన్న విష‌యాల‌ను గ‌త పాల‌కుడు అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టిన విష‌యం తెలిసిందే.

లేదా కొన్నింటిని ఎన్నిక‌లకు ఆరు మాసాల ముందు అమ‌లు చేసి మ‌మ అనిపించుకున్నారు.
ఈ ప‌రిస్థితి వ‌ల్లే చంద్ర‌బాబు ఓడిపోయారు కాబ‌ట్టి తాను అధికారంలోకి వ‌చ్చ‌ని నాటినుంచి కూడా మేనిఫె స్టోను అమ‌లు చేస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ అదే మార్గంలో ప‌య‌నిస్తున్నారు. అయితే, ఒక్క మేనిఫెస్టోతోనే ప్ర‌జ‌ల మ‌న‌సులుచూర‌గొన‌డం సాధ్యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు డిఫ‌రెంట్ గా ఉన్నాయ‌ని ఆయా ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చాల్సిన అవ‌స‌రం కూడా సీఎంగా జ‌గ‌న్‌పై ఉంద‌ని చెబుతున్నారు.

రాష్ట్రంలో ఉపాధి క‌ల్ప‌న‌తో పాటు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాన్ని కూడా త‌న‌వైపు తిప్పుకొనేలా కాలేజీల్లో ఫీజుల నియంత్ర‌ణ‌, తాగునీటి సౌక‌ర్యాలు, విద్యుత్ ధ‌ర‌లు, వైద్యం వంటివాటిని చేరువ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు చేస్తున్నాం.. క‌దా.. అంటే.. ఇది చాల‌ని ఇంకా పెంచాల‌ని సూచిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version