మహా శివరాత్రి సందర్భంగా దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు, 12 జ్యోతిర్లి౦గాల్లో భక్తులు శివుడి నామస్మరణతో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమః శివాయా అంటూ శైవ క్షేత్రాలు భక్తులతో కిట కిటలాడుతున్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గుజరాత్ లోని సోమనాథుడు, శ్రీశైలం లోని మల్లిఖార్జునుడు, ఉజ్జయిని లోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వరుడు,
హిమాలయాలలోని కేదారినాథుడు, మహారాష్ట్ర లోని భీమశంకరుడు, వారణాశి లోని కాశీ విశ్వనాథుడు, మాహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, డియోగర్ లోని వైద్యనాథుడు, ద్వారక లోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు మరియు చ ఔరంగాబాద్ లోని గ్రీష్మేశ్వరుడు ఇలా 12 పుణ్యక్షేత్రాలలో భక్తులు పూజలు చేస్తున్నారు. ప్రభుత్వాలు భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసాయి. గంగా నదిలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసారు.
తమిళనాడు లోని కోయంబత్తూర్ లో ఉన్న ఈశా ఫౌండేషన్ లో కూడా భక్తులు అతి పెద్ద శివుడి విగ్రహానికి పూజలు చేసారు. దక్షిణాదిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో భక్తులు పెద్ద ఎత్తున శైవ క్షేత్రాలకు తరలి వెళ్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పురాతన శివాలయాల్లో శివుడు పూజలు అందుకుంటున్నాడు. అదే విధంగా ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉన్న అన్ని దేవాలయాల్లో భక్తులు పూజలు చేస్తున్నారు.
బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా పురాతన శివాలయాలు ఉన్నాయి. వాటిల్లో కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. వారణాసి లో అఘోరాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా కాశీ విశ్వనాథ్ ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా తరలి వెళ్ళారు. దీనితో వారణాసి వీధులు అన్నీ కూడా ఓం నమఃశివాయ అంటూ శివుడిని కీర్తిస్తున్నాయి.