రన్ మెషీన్ కింగ్ విరాట్ కోహ్లి ఫ్యాన్స్ కి బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 2 నుంచి 29 వరకూ అమెరికా, వెస్ట్ ఇండీస్ వేదికగా జరగబోయే T20 వరల్డ్ కప్లో ఇండియా జట్టు నుంచి విరాట్ కోహ్లిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వెస్టిండీస్ స్లో వికెట్ పిచ్లు విరాట్ కోహ్లికి సూట్ కావని బీసీసీఐ భావిస్తుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో కింగ్ కోహ్లిని ఒప్పించే బాధ్యతలు అజిత్ అగార్కర్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ t 20 ప్రపంచ కప్ లో పాల్గొనే 20 జట్లను ఐసీసీ 4 గ్రూపులుగా విభజించింది.గ్రూప్-ఎలో భారత్, ఐర్లాండ్,పాకిస్థాన్, అమెరికా, కెనడా ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,స్కాట్లాండ్, నమీబియా, ఒమన్ ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్,వెస్టిండీస్, ఆప్ఘనిస్తాన్, పపువా న్యూగినియా,ఉగాండ ఉన్నాయి. గ్రూప్-డిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ ,బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.