వచ్చేనెల మే 13 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.ఇందులో భాగంగా కొందరు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరికొందరు ఒక పార్టీ నుండి మరొక పార్టీకి వెళ్తూ ఉన్నారు.
తాజాగా వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఇటీవల కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసి చీరాల టికెట్ ఆశించారు. కానీ వైసీపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆమంచి 2014లో పోటీ చేసి చీరాల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు.