ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాలో అయ్యే డైట్ తెలిస్తే షాక్..!!

-

స్టార్ హీరో అంటే కేవలం నటన , అందం ఉంటే సరిపోదు అందుకు తగ్గట్టుగా బాడీ ఫిట్నెస్ కూడా ఉండాలి. అప్పుడే సినిమాలలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైనట్టు లెక్క.. ఇతర సినీ ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మన తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలు మంచి బాడీ ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తేనే వారికి మరింత గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోని టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తమను తాము ఎప్పటికప్పుడు మార్చుకుంటూ బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన బాడీను ఫిట్ గా ఉంచడానికి ఎలాంటి డైట్ ఫాలో అవుతారు అని అభిమానులు కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆయన ఫాలో అయ్యే డైట్ కూడా ఒకసారి తెలుసుకుందాం.

ప్రతిరోజు అల్లు అర్జున్ ఉదయం లేవగానే ఒక గంట పాటు రన్నింగ్ చేసి.. ఆ తర్వాత ఒక కప్పు కాఫీ, అరగంట ఆగిన తర్వాత ఒక కప్పు జ్యూస్ తాగుతారట. ఇక ఆ తర్వాత ఎనిమిది గంటలకు మూడు ఆమ్లెట్లు.. ఉదయం 12 గంటల సమయంలో లంచ్ కి ముందు ఒక సూప్, గ్రీన్ సలాడ్ వంటివి తీసుకుంటారు. ఇక అందులో ముఖ్యంగా ప్రోటీన్ కోసం చికెన్ ఎగ్ ఉండేలా చూసుకుంటారట. ఇక మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కార్బోహైడ్రేట్స్ ఉండే విధంగా ఏదైనా భోజనం చేస్తూ ఉంటారట అల్లు అర్జున్. ఇక సాయంత్రం ఐదు గంటల సమయంలో ఉడకబెట్టిన గింజలను తిన్న తర్వాత ఆరోగ్యకరమైన పండ్ల రసం తీసుకుంటారు అని సమాచారం.

ఇక డిన్నర్ విషయానికి వస్తే బ్రౌన్ రైస్ తో కలిగిన చికెన్, చేపలతో డిన్నర్ పూర్తి చేస్తారట. పాలను మాత్రం ఆయన ఫిట్నెస్ కోసం దూరం పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా రాగి ముద్ద, నాటుకోడి పులుసు అంటే తెగ ఇష్టంగా తింటారట అల్లుఅర్జున్. ఇక ఇటీవల కాలంలో ఫిట్నెస్ కోసం చికెన్ తినడం కూడా తగ్గించారట. ఇక ఏది ఏమైనా ఆయన ఫాలో అయ్యే ఈ డైట్ ను అభిమానులు కూడా ఇన్స్పైర్ గా తీసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version