ఇటీవల ఉత్తర ప్రదేశ్, గోవా, ఉత్తరా ఖండ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి చెందింది. అంతే కాకుండా పంజాబ్ లో అధికారాన్ని కూడా కోల్పోయింది. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే తీవ్రంగా విమర్శించారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను రాజీనామా చేయాలని డిమాండ్ కూడా ముందుకు వచ్చింది.
కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ రాజీనామాల డిమాండ్ ను తొసి పూచ్చింది. అయితే తాజా గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ఓటిమి చెందిన ఉత్తర ప్రదేశ్, గోవా, ఉత్తరా ఖండ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల పీసీసీలకు షాక్ ఇస్తూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఐదు రాష్ట్రాల పీసీసీలు వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి సుర్జేవాలా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పీసీసీల పునర్ వ్యవస్థీకరణ చేయాలని సోనియా భావిస్తున్నారని తెలిపారు. కాగ కాంగ్రెస్ పార్టీ సంస్కరణల దిశగా ముందుగు అడుగులు వేస్తుందని అన్నారు.