ఎంపీ రఘురామ వ్యవహారం రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఆయన కేంద్రమంత్రులను కలిస జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడంతో.. జగన్ యాక్షన్‌లోకి దిగారు. దీంతో లోక్ సభ స్పీకర్‌కు సైతం తమ ఎంపీ ద్వారా లెటర్ ఇచ్చి అనర్హత వేటు వేయాలంటూ కోరారు. అలాగే తమ అధికార వెబ్ సైట్ నుంచి కూడా పేరును తొలగించి షాక్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఎంపీ రఘురామ సొంత నియోజకవర్గమైన నర్సాపురంలోని ప్రజలు ఎంపీపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. నియోజకవర్గంలో పెరుగుతున్న ఈగల మోతపై ఎలాంటి చర్యలు లేవంటూ మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా.. అనవసర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
రీసెంట్‌గా ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు అక్కడి ప్రజలు. ఏపీ బహుజన ఐక్య వేదిక అధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ జరిగినట్టు తెలుస్తోంది. రెండేళ్లుగా నర్సాపురాన్ని డెవలప్ చేయడం మర్చిపోయారంటూ విమర్శిస్తున్నారు. ఓట్లు వేసిన తమను అస్సలు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజవర్గలో పెరుగుతున్న ఈగల బెడదను వెంటనే తగ్గించాలని లేదంటే తమ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెబుతున్నారు.