పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పుల్లేవ్.. ఒక్క ముంబైలో మాత్రం..!

-

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్డగా మార్పుల్లేవు. ఒక్క ముంబైలో మాత్రం సోమవారంతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముంబైలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 102.98 కాగా లీటర్ డీజిల్ 94.70 గా అమ్మకాలు జరుగుతున్నాయి.

దేశంలో నాలుగు మెట్రో సిటీలు అయిన ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.41 పైసలు కాగా డీజిల్ రూ. 87.28గా ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.69గా ఉండగా డీజిల్ ధర రూ. 91.92గా కొనసాగుతోంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.34 కాగా లీటర్ డీజిల్ ధర రూ. 90.12గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ మంగళవారం కూడా రూ.100.20గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 95.14గా సాగుతోంది. అంతర్జాతీయం ముడిచమురుకు ఏర్పడిన డిమాండ్‌ను బట్టి ధరల్లో హెచ్చు, తగ్గులు ఉంటాయని వ్యాపారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version