ర‌వి ప్ర‌కాష్‌కు షాక్.. హైకోర్టు, నాంపెల్లి కోర్టుల్లో వేర్వేరు పిటిషన్లు

-

టీవీ9 మాజీ డైరెక్ట‌ర్ ర‌విప్ర‌కాష్‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. ఏబీసీపీఎల్ నిధుల దుర్వినియోగం కేసులులో ఆయ‌న స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రెట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని హై కోర్టుతో పాటు నాంప‌ల్లి కోర్టులో వేర్వేరు పిటిషన్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రెట్ దాఖ‌లు చేసింది. విచారాణ‌కు హాజ‌రు కావాలాని నాలుగు సార్లు స‌మ‌న్లు జారీ చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సారి కూడా విచార‌ణ కు హాజ‌రు కాలేడ‌ని కోర్ట‌లకు స‌మ‌ర్పించిన పిటిషన్ల‌లో వివిరించింది.

స‌మ‌న్లు దిక్క‌రించిన ర‌వి ప్ర‌కాష్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టుల‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రెట్ కోరింది. అలాగే ర‌వి ప్ర‌కాష్ ముంద‌స్తు బెయిల్ ను సైతం ర‌ద్దు చేయాల‌ని హై కోర్టును కోరింది. 2020 డిసెంబ‌ర్ వ‌ర‌కు నాలుగు సార్లు స‌మ‌న్లు జారీ చేశామ‌ని ఈడీ తెలిపింది. అయితే ర‌వి ప్ర‌కాష్ ఉద్ధేశ పూర్వకంగానే విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డం లేద‌ని పిటిషన్ల‌లో ఈడీ తెలిపింది.

కాగ స‌మ‌న్లు దిక్క‌రించినందుకు, విచార‌ణ‌కు హాజ‌రు కానంద‌కు.. ర‌వి ప్ర‌కాష్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టుల‌ను ఈడీ కోరింది. అలాగే ఆయ‌న బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కోర్టుల‌ను ఈడీ కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news