నేడే ఏపీ బ‌డ్జెట్.. రూ. 2.50 ల‌క్షల కోట్లుతో అంచనా!

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కాగ ఈ రోజు అసెంబ్లీలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి అసెంబ్లీలో 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 2.50 ల‌క్షల కోట్ల‌తో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంది. కాగ ప్ర‌స్తుతం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా ఈ ఏడాది బ‌డ్జెట్ ఏ విధంగా రూపొందించార‌నే ఆస‌క్తి నెలకొంది.

నెల నెల అప్పుల‌తో రాష్ట్రాన్ని నెట్టుకుస్తున్న ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం.. ఈ సారి బ‌డ్జెట్ పై ఉత్కంఠ నెల‌కొంది. సంక్షేమ ప‌థ‌కాలే కాకుండా, అభివృద్ది కార్య‌క్ర‌మాలు, సాగునీటి ప్రాజెక్టుల‌తో పాటు కొన్ని భారీ స్థాయి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి బడ్జెట్ లో భారీ స్థాయిలో ప‌ద్దులు కేటాయించే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా న‌వ‌ర‌త్నాల‌కు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ లో అధిక శాతం ప‌ద్దులు కేటాయించే అవ‌కాశం ఉంది.

కాగ ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు రాష్ట్ర కేబినెట్ స‌మావేశం అవుతుంది. రాష్ట్ర బ‌డ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అనంత‌రం ఈ రోజు ఉద‌యం 10:30 గంట‌ల‌కు అసెంబ్లీ ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి ప్ర‌వేశ పెడుతారు. అలాగే మండ‌లిలో మంత్రి అప్ప‌లరాజు బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news