షాకింగ్; పెంపుడు పిల్లులకు కరోనా…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రోజు రోజుకి ఇది కొత్త రూపు సంతరించుకోవడం ఆందోళన కలిగించే అంశం. జంతువులకు కూడా ఇప్పుడు కరోనా క్రమంగా సోకుతుంది. జూలో ఉండే జంతువులకు, కాకులకు కరోనా వైరస్ రావడం… తాజాగా పిల్లులకు కరోనా వైరస్ బయటపడటం మరింతగా భయపెడుతుంది. రెండు పిల్లులకు కరోనా వైరస్ సోకింది.

ఆ రెండు కూడా పెంపుడు పిల్లులే కావడం గమనార్హం. అమెరికాలోని న్యూయార్క్‌లో పిల్లులకు కరోనా సోకింది అని అధికారులు వివరించారు. డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్, యూఎస్ డీఏ నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లేబరేటరీస్ దీనిపై కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ సోకిన ఈ పిల్లులు వేర్వేరు చోట్ల నివసిస్తున్నాయని, శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నాయని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పిల్లుల యజమానులకు మాత్రం కరోనా వైరస్ రాలేదు. బ్రాంక్స్ జూకు చెందిన పులులకు, సింహాలకు కరోనా వచ్చింది. మనుషుల నుంచి సోకిందా… లేక వాటికి ఏదైనా విధానంలో కరోనా సోకిందా అనేది అర్ధం కావడం లేదు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు. దీనితో అమెరికా పశు వైద్య శాఖ అప్రమత్తమైంది. సదరు పిల్లులను ప్రత్యేకంగా ఉంచి చికిత్స చేయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news